తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి చేపట్టారు. ఈ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే 1,226 గ్రామాలకు త్రాగునీరు అవసరాలు తీరనున్నాయి.
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభించిన సీఎం కేసీఆర్#PalamuruRangareddyProject pic.twitter.com/juZAw2nTQS
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2023
ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, స్మితా సబర్వాల్‌తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
🌊🌊 “పాలమూరు-రంగారెడ్డి”తో కృష్ణా జలాలకు స్వాగతం…
కరువు కాటకాల పీడ ఇక గతం..!
💧💧 వలసలతో విలపించిన పాలమూరును పాలు పొంగే జీవగడ్డగ మారుస్తున్న అపూర్వ ఘట్టం.
🌾 🌾 ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ 1,226 గ్రామాలకు త్రాగునీరు అవసరాలను… pic.twitter.com/0BGrIt2yoq
— Telangana CMO (@TelanganaCMO) September 15, 2023