Hyderabad, January 31: సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చి ఇక వేసవి మొదలవబోతుందని సంకేతాలు వచ్చిన తరుణంలో తెలంగాణలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శుక్రవారం వరకు కొద్దిగా ఉక్కపోతగా ఉండి, శనివారం వచ్చేసరికి ఉష్ణోగ్రతలు పడిపోయి చలితీవ్రత పెరిగింది. జనవరి 30 తర్వాత వివిక్త ప్రదేశాలలో పొగమంచు సంభవించే అవకాశం ఉండటమే కాకుండా, కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఐఎండీ సూచన ప్రకారం, హైదరాబాద్‌లో జనవరి 31 నుండి ఫిబ్రవరి 4 వరకు రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది, హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లలో 12 నుంచి 13 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవ్వచ్చు. అయితే పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణంగానే 31 డిగ్రీలు నమోదవుతాయి.
రాష్ట్రంలోని కొన్ని ప్రదేశాలలో వాతావరణం పొడిగా ఉంటూ కనీస ఉష్ణోగ్రతలు 3.1 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ బులెటిన్ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీమ్ జిల్లా, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ ఆ ప్రదేశాలలో సింగిల్ డిజిట్స్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి ప్రభావం ఉంటుంది, అయితే దక్షిణ తెలంగాణలోని ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండబోదని నివేదికలు వెల్లడించాయి.
రాష్ట్రంలోని కొన్ని ప్రదేశాలలో కనీస ఉష్ణోగ్రతలు 3.1 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ బులెటిన్ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీమ్ జిల్లా, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ ఆ ప్రదేశాలలో సింగిల్ డిజిట్స్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి ప్రభావం ఉంటుంది, అయితే దక్షిణ తెలంగాణలోని ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండబోదని నివేదికలు వెల్లడించాయి.
ఆగ్నేయ మరియు దక్షిణ దిశ నుండి వీస్తున్న శీతల పవనాలే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు
హెచ్చుతగ్గులకు కారణమని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర తీరప్రాంతంలో కూడా ఇవే పరిస్థితులు ఉండనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.