
Hyderabad, July 10: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (TS Chief Minister K. Chandrasekhar Rao) ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలపాలంటూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ను విచారిణకు స్వీకరించలేమంటూ తేల్చి చెప్పింది. కాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో (Petition On CM KCR's Health) తెలపాలంటూ రాష్ట్ర హైకోర్టులో నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. సచివాలయం కూల్చివేత పనులు ఆపండి, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, దేవాలయం, మసీదు దెబ్బతినడంపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించలేమని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఆరోగ్య వివరాలను ఆరా తీయాలని వేసిన ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో ఉందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తే ఉరుకునేది లేదని పిటిషనర్ కి మొట్టికాయలు వేసింది. ముఖ్యమంత్రి కనిపించక పోతే హెబియస్ కార్పస్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. కేసీఆర్ కనపడుట లేదు, తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన యువకుడు, కేసీఆర్ ఎక్కడో చెప్పాలంటూ ప్రగతి భవన్ వద్ద ఓ యువకుడు మెరుపు నిరసన, అరెస్ట్
కొంత కాలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించడం లేదని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల పుకార్లు వస్తున్నాయని, దీంతో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ప్రజలు ఆందోళ చెందుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని నవీన్ తన పిటిషన్‌లో హైకోర్టు కోరారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా స్వీకరించాలని కోరారు. ఈ పిటిషన్ విచారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.