Plasma Therapy in India for Coronavirus (Photo Credits: PTI)

Hyderabad, May 11: కరోనావైరస్ (Coronavirus) బాధితులకు సోమవారం నుంచి ప్లాస్మా థెరపీ చికిత్స (plasma therapy clinical trials) అందించేందుకు గాంధీ ఆస్పత్రిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) ఏర్పాట్లు చేసింది. గాంధీ, ఈఎస్‌ఐసీ దవాఖానల్లో ప్లాస్మా థెరపీ చికిత్సకు (Plasma Therapy at Gandhi Hospital) ఐసీఎమ్మార్‌ ఇటీవలే అనుమతించిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్‌తో కోలుకొన్న 15 మంది చికిత్సకు అవసరమైన ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆర్థిక పరిస్థితి సంగతేంటి, రాష్ట్రాల సీఎంలతో 3 గంటలకు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్, లాక్‌డౌన్‌ ఎత్తివేత, ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం వంటి అంశాలే ప్రధాన ఎజెండా

అలాగే గాంధీ ఆస్పత్రిలో (Gandhi Hospital) కరోనావైరస్ నుంచి కోలుకొన్నవారిలో 200 మంది కూడా ప్లాస్మా ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం విదేశాల నుంచి వచ్చిన 15 మంది రక్తం నుండి ప్లాస్మాను సేకరించనున్నారు. ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాల ప్రకారం ప్లాస్మా థెరపీకి అర్హులైన కరోనా బాధితులు గాంధీలో ప్రస్తుత ఐదుగురు ఉన్నారని అధికారులు తెలిపారు.

ప్లాస్మా థెరపీకి ఎంపికచేసిన బాధితుడికి ఇదివరకు వైరస్‌ నుంచి కోలుకొన్నవారిలో ఆరోగ్యవంతుల ప్లాస్మాను సేకరించి చికిత్స పొందుతున్న వారికి అందిస్తారు. శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌లను చంపే యాంటీ బాడీ (ప్రతిరక్షకం)లు ఈ ప్లాస్మాలో ఉంటాయి. కరోనావైరస్ నుంచి కోలుకొన్నవారి ప్లాస్మాలో వైరస్‌ను చంపే యాంటీ బాడీలు ఉంటాయి. శరీరంలో ఉన్న వైరస్‌ కణాలను తెల్లరక్తకణాలు గుర్తించి నాశనంచేస్తాయి. ఒక దాత నుంచి సేకరించిన ప్లాస్మాతో నలుగురికి చికిత్స అందించవచ్చు. ఈ ట్రయల్స్ విజయవంతమయితే కరోనా రోగులు త్వరగా కోలుకునే ఛాన్స్ ఉంటుంది.