Hyderabad, AUG 25: హైదరాబాద్ లో వినాయక చవితి (Vinyaka chathuthi) వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. 11 రోజుల పాటు నగరం అంతా సందడి నెలకొంటుంది. వినాయక చవితి రోజున హైదరాబాద్ లో (Hyderabad) గణేశుడి విగ్రహాలకు (Ganesh idols) బాగా డిమాండ్ ఉంటుంది. అయితే, ఈ సారి డిమాండుకు తగ్గ గణేశుడి విగ్రహాలు హైదరాబాద్ లో తయారు కాలేదు. దీంతో ధరలు బాగా పెరిగిపోయాయి(Prices hiked). గణేశుడి విగ్రహాలను ముందస్తుగా కొనుగోలు చేసేందుకు వెళ్తున్న నగరవాసులు అక్కడి ధరలు చూసి షాక్ అవుతున్నారు. ఈ సారి ధరలు గత ఏడాది కంటే దాదాపు 40 శాతం పెరిగాయని మీడియాకు హైదరాబాద్ లోని గణేశ్ విగ్రహాల తయారీదారుడు ఒకరు తెలిపారు. ఈ సారి విగ్రహాలను తక్కువ తయారు చేశామని అన్నారు.
Telangana | Prices of Lord Ganesh idols hike in Hyderabad due to less production ahead of #GaneshChaturthi
Customers' response increased a lot as compared to last year, but production is pretty less this year. Thus, the rate has increased by 40% from last yr: Shopkeeper (24.08) pic.twitter.com/3z25j1i0Wi
— ANI (@ANI) August 25, 2022
కరోనా కారణంగా గత రెండు ఏళ్ళుగా గణేశుడి విగ్రహాల అమ్మకాలు తగ్గాయి. అయితే, ఈ సారి మాత్రం వినాయకుడి భక్తుల నుంచి భారీగా డిమాండ్ ఉందని గణేశ్ విగ్రహాల తయారీదారుడు తెలిపారు. వినాయక చవితికి మరో వారం రోజులు ఉండగానే ఇప్పటికే భక్తులు భారీగా వచ్చి కొనుగోళ్ళు చేస్తున్నారు. డిమాండ్ ఇంతగా ఉంటుందని విగ్రహాల తయారీదారులు ఊహించలేదు. డిమాండ్ అధికంగా ఉండడంతో ధరలు కూడా భారీగా పెరిగాయి.
రెండేళ్లుగా కరోనా కారణంగా వినాయక చవితిని ఆడంబరంగా జరుపుకోలేని పరిస్థితి, ఈ సారి వైభవంగా వేడుకలను నిర్వహించాలని ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు భావిస్తున్నారు. దీంతో ధరలు భారీగా పెరిగాయి.