CM KCR Rajshyamala Yagam (PIC@ BRS X)

Hyderabad, NOV 01: మరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ (CM KCR) మరోసారి యాగం నిర్వహిస్తున్నారు. బహుశా మూడో సారి కూడా ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలనే సంకల్పంతో రాజశ్యామల, శత చండీ యాగం (Shatha Chandiyagam) చేయనున్నట్లుగా తెలుస్తోంది. సిద్ధిపేటలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు సీఎం కేసీఆర్ యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో సీఎం కేసీఆర్ సతీసమేతంగాపాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ తరచు యాగాలు నిర్వహిస్తుంటారనే విషయం తెలిసిందే. కీలక కార్యక్రమాల సందర్భంగా యాగాలు చేయిస్తుంటారు. సతీ సమేతంగా పాల్గొని నియమనిష్టలతో పూజలు చేస్తుంటారు. దీంట్లో భాగంగా తెలంగాణలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో మరోసారి రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో పలువురు పండితులతో ఐదు రోజుల పాటు రాజశ్యామల యాగం (Rajshyamala Yagam) నిర్వహించనున్నారు. అంతేకాదు యాగ నిర్వహణకు కర్ణాటక,ఆంద్రప్రదేశ్ నుండి దాదాపు 200 మందికి పైగా పురోహితులు హాజరుకానున్నారని సమాచారం.

Telangana Assembly Elections 2023: మొండి కత్తి మాకూ దొరకదా, చాతకాని ప్రతిపక్ష దద్దమ్మ పార్టీలు, వెదవలు కత్తులతో దాడికి పాల్పడుతున్నారు, సీఎం కేసీఆర్ ఫైర్ వీడియో ఇదిగో.. 

అధికారం సిద్ధించటానికి… శత్రువుల బలం తగ్గడానికి, జన వశీకరణ కోసం కూడా ఈ యాగం చేస్తారని పండితులు చెబుతుంటారు.ఈ యాగంలో భాగంగా మొదటి రోజున అంటే ఈరోజు సీఎం కేసీఆర్ దంపతులు గోపూజ చేసి యాగ ప్రవేశం చేస్తారు. ఆ తరువాత శాస్త్ర నియమ నిబంధనల ప్రకారం యాగం ఐదు రోజుల పాటు కొనసాగనుంది.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధన తరువాత అధికారంలోకి వచ్చిన గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోసారి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. దీని కోసం రాజశ్యామల యాగం నిర్వహించనున్నట్లుగా సమాచారం.