Hyderabad, Oct 27: హైదరాబాద్ (Hyderabad) శివారుల్లోని జన్వాడలో రిజర్వ్ కాలనీలో (Rave Party at Janwada Farmhouse) రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. విషయం తెలుసుకొన్న సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాన్ని భగ్నం చేశారు. వీఐపీల రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అలాగే, ఫారిన్ లిక్కర్, డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జన్వాడలోని రిజర్వ్ కాలనీలో రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో వీఐపీల రేవ్ పార్టీ జరిగింది. డీజే సౌండ్స్ తో బీభత్సం సృష్టించడంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. రేవ్ పార్టీలో విదేశీ మద్యం, డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు.
Here's Video:
జన్వాడ రేవ్ పార్టీలో వ్యాపారవేత్త విజయ్ మద్దూరి
విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ నిర్థారణ
విజయ్ మద్దూరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
NDPS యాక్ట్, సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు
రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురు ప్రముఖులు
రేవ్ పార్టీ వివరాలను గోప్యంగా ఉంచడంపై పలు… https://t.co/1PT2GEaOzz pic.twitter.com/N2FgC9iHHa
— BIG TV Breaking News (@bigtvtelugu) October 27, 2024
డ్రగ్స్ తీసుకున్నారు
పార్టీలో 42 మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పలువురు కొకైన్ తీసుకున్నట్టు తేలింది. మరో ఇద్దరికి కూడా డ్రగ్స్ పాజిటివ్ గా తేలినట్టు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.