Hyd, Oct 27: హైదరాబాద్ జన్వాడ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. రాజ్ పాకాల అనే వ్యక్తి ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందగా రంగంలోకి దిగిన పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరి అనే వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. అలాగే ఈ పార్టీలో ప్రముఖులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ రేవ్ పార్టీ జరిపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. రేవ్ పార్టీ వ్యవహారంలో తెలంగాణ సమాజం సిగ్గు పడుతోందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రం డ్రగ్స్ రహితంగా ఉండాలని సీఎం రేవంత్ ఉక్కుపాదం మోపుతున్నారు అన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ వ్యవహారంలో ప్రభుత్వంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా అన్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్నవారు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖకు విజ్ఞప్తి చేసిన వెంకట్..రేవ్ పార్టీకి సంబంధించిన ఆధారాలన్నిటినీ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
జన్వాడ ఫామ్‌హౌస్ రేవ్‌పార్టీ ఇష్యూపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకుంటుంటే.. కేటీఆర్ బంధువు రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లోనే రేవ్ పార్టీలు జరగడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అయితే, పోలీసుల రైడ్ కంటే ముందే రేవ్ పార్టీ నుంచి కొంతమంది వెళ్లిపోయారనే సమాచారం తమ వద్ద ఉందని అన్నారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీపై సిట్ వేయాలన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, సీసీటీవీ ఫుటేజ్‌ను బయటపెట్టాలని డిమాండ్
Here's Tweet:
TG: జన్వాడ ఫామ్‌హౌస్ రేవ్‌పార్టీ ఇష్యూపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకుంటుంటే.. కేటీఆర్ బంధువు రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లోనే రేవ్ పార్టీలు జరగడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అయితే, పోలీసుల రైడ్… pic.twitter.com/yoz59mEohB
— ChotaNews (@ChotaNewsTelugu) October 27, 2024
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బంధువు రాజ్ పాకాల ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై సిట్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్ పాకాల ఫామ్ హౌస్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Here's Tweet:
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రం డ్రగ్స్ రహితంగా ఉండాలని సీఎం రేవంత్ ఉక్కుపాదం మోపుతున్నారు: బల్మూరి వెంకట్
జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ వ్యవహారంలో ప్రభుత్వంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. రేవ్ పార్టీలో పాల్గొన్నవారు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని పోలీసు… pic.twitter.com/lnuUBOydaD
— ChotaNews (@ChotaNewsTelugu) October 27, 2024
తెలంగాణ సమాజం సిగ్గు పడుతోంది.. రేవ్ పార్టీ ఇష్యూపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు pic.twitter.com/neHcAz9TCj
— ChotaNews (@ChotaNewsTelugu) October 27, 2024