Hyderabad, Nov 19: 40 మంది విద్యార్థులతో (School Students) వెళ్తున్న ఓ స్కూల్ బస్సు (School Bus) అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన బస్సు ఉదయం విద్యార్థులను ఎక్కించుకుని స్కూల్ కు బయలుదేరింది. మార్గంమధ్యలో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ బంజారాహిల్స్ లో కారు బీభత్సం.. యాక్సిడెంట్ జరగ్గానే డ్రైవర్ పరారీ (వీడియో)
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్సు.. 40 మంది విద్యార్థులకు గాయాలు
మేడ్చల్ - కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూలుకు చెందిన బస్సు ఉదయం విద్యార్థులను పికప్ చేసుకుని స్కూలుకు బయలుదేరింది.… pic.twitter.com/W44loXv2XE
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2024
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ బస్సు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నిద్రమత్తులో బస్సును డ్రైవ్ చేసినట్లు పిల్లల పేరెంట్స్ అనుమానిస్తున్నారు. ఈ మేరకు పొలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.