Hyderabad, Sep 1: రాష్ట్రంలో బడి గంట మోగింది. కరోనా నేపథ్యంలో 18 నెలల తర్వాత పాఠశాలలు (Schools Opened in TS) తిరిగి ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ చిన్నారులు స్కూళ్లకు వస్తున్నారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ స్కూల్‌కు విద్యార్థులు అధిక సంఖ్యలో వచ్చారు. మాస్క్‌లు ధరించిన విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యారు. కొన్ని చోట్ల స్కూల్ సిబ్బంది విద్యార్థులను శానిటైజ్ చేశారు. 16 నెలలుగా పాఠశాలలకు దూరంగా ఉన్న పిల్లలకు ఇప్పుడు మళ్లీ బడిబాట పట్టారు. దీంతో స్కూళ్లలో ఆనందకర వాతావరణం నెలకొన్నది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ స్కూల్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai Soundararajan) పరిశీలించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పాఠశాలను అధికారులు చాలాబాగా శుభ్రం చేయించారన్నారు. విద్యార్థులు సంతోషంగా, నిర్భయంగా స్కూలుకు వచ్చారని వెల్లడించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. మాస్కు ధరించడంపై విద్యార్థులకు అవగాహన ఉందని చెప్పారు. పిల్లలకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు జాగ్రత్తగా (Care should be taken until the child is vaccinated) ఉండాలని సూచించారు.
Here's Governor Tweet
Hon’bleGovernor visited Raj Bhavan HighSchool Hyderabad today at 8.30am on the reopening day to review #Covid_19 preventive measures in place for the safety of children & interacted with students & teachers & parents alongside Rajbhavan officers & #IRCS volunteers in the venue pic.twitter.com/bE7O6XBGCh
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) September 1, 2021
రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులు ధరించి విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. భౌతిక తరగతులకు ముందే సిబ్బందని స్కూళ్లను శుభ్రం చేయించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలు పరిశీలించిన తర్వాతే తరగతులకు అనుమతించారు.
తెలంగాణలో గురుకులాలు, హాస్టళ్లు మినహా అన్నింటా ప్రత్యక్ష తరగతులు ప్రారంభం అయ్యాయి. ఇంటర్, డిగ్రీ కాలేజీలు కూడా ప్రత్యక్ష తరగతులను మొదలుపెట్టాయి. ఇంటర్ విద్యార్థులు అవసరమైతే యూట్యూబ్ పాఠాలు వినవచ్చు అని విద్యాశాఖ పేర్కొన్నది. సిటీలోని కొన్ని స్కూళ్లు మరికొన్ని రోజులు ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ స్కూళ్లు ప్రత్యక్ష తరగతుల కోసం తెరుచుకున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Education minister Sabitha Indra reddy) తెలిపారు. బుధవారం విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ స్కూళ్లల్లో పారిశుధ్యం పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కొవిడ్ నిభందనలు తప్పక పాటించాలని ఆదేశాలు ఇచ్చామని...ప్రార్థన సమయంలోనే జాగ్రత్తలు గుర్తు చేయాలని తెలిపారు.
60 లక్షల మంది విద్యార్థుల్లో 20 లక్షల మంది ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారన్నారు. ఈ ఏడాది ఫస్ట్ క్లాస్‌లో అదనంగా లక్ష మంది జాయిన్ అయ్యారని అన్నారు. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 2 న్నర లక్షల కొత్త అడ్మిషన్లు వచ్చాయన్నారు. విద్యార్థులను తమ సొంత బిడ్డలా చూసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు.
రాజేంద్రనగర్‌లో రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల తనిఖీలు నిర్వహించారు. 12 పాఠశాలలకు చెందిన బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు పాతర వేస్తున్న పాఠశాల బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ రోజు నుంచి స్కూళ్లు ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే బస్సులపై రవాణా శాఖ నిఘా పెట్టింది. రంగారెడ్డి జిల్లా ఉప రవాణా అధికారి ప్రవీణ్‌రావు ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో అధికారుల బృందం ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. బస్సులకు సంబంధించి అన్ని పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిట్‌నెస్, పర్మిట్, ట్యాక్స్ లు లేకుండా రోడ్డుపై తిరుగుతున్న వాటిపై అధికారులు కఠినంగా వ్యవహరించారు.