Hyderabad, March 23: బోయిగూడలో (Bhoiguda) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. ఉదయం 4 గంటల సమయంలో బోయిగూడలోని ఓ టింబర్ డిపోలో (Tiber Depo) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి డిపో మొత్తానికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున్న అగ్నికీలలు (Massive Fire)ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అదుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. మంటల ధాటికి గోడౌన్ పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది అక్కడికక్కడే మరణించారని అధికారులు చెప్పారు. వీరిలో కొందరు సజీవదహనమవగా, మరికొందరు ఊపిరాడక చనిపోయారన్నారు. మరొకరు క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు. ప్రమాద సమయంలో టింబర్ డిపోలో 12 మంది ఉన్నారని చెప్పారు.
Telangana | 11 people died after a fire broke out in a scrap shop in Bhoiguda, Hyderabad
Out of 12 people, one person survived. DRF reached the spot to douse the fire. A shock circuit could be the reason for the fire. We are investigating the matter: Mohan Rao, Gandhi Nagar SHO pic.twitter.com/PMTIDa5ilg
— ANI (@ANI) March 23, 2022
మృతులంతా బీహార్‌కు (Bihar) చెందిన వలస కార్మికులని తెలిపారు. మృతులను బిట్టు, సికిందర్, దామోదర్, సత్యేందర్, చింటు, దినేష్, రాజేష్, రాజు, దీపక్, పంకజ్‌గా గుర్తించారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో టింబర్ డిపో, స్క్రాప్ గోదాం ఉన్నాయని పోలీసులు చెప్పారు. టింబర్ డిపో నుంచి స్క్రాప్ గోదాముకు మంటలు వ్యాపించాయన్నారు. పొగ దట్టంగా కమ్ముకోవడంతో మృతదేహాలను వెలికితీయడానికి ఇబ్బందయిందని తెలిపారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఉదయం 6 గంటల లోపు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas Yadav) యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఇది బాధాకరమైన సంఘటన అన్నారు. ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. అర్థరాత్రి దాటిన తర్వాత మంటలు అంటుకున్నాయని.. వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది స్పందించి చర్యలు తీసుకున్నారని మంత్రి చెప్పారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా.. 11 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. సిబ్బంది కూడా చాలావరకూ శ్రమించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఘటన జరిగిన తీరుపై ప్రభుత్వ పరంగా విచారణ చేసి.. కారణాలు తెలుసుకుంటామన్నారు. చనిపోయిన వారి కుటుంబీకులకు ఆయన సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు.
ప్రమాదం జరిగిన స్థలానికి పరిసరాల్లో చాలా వరకూ స్క్రాప్ గోడౌన్స్ (Scarp gowdens) ఉన్నాయని మంత్రి చెప్పారు. అన్ని విషయాలను విచారణలో గుర్తించి.. పూర్తి వివరాలు చెబుతామన్నారు. బాధితులకు తగిన విధంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. నగరంలోని మిగిలిన స్క్రాప్ గోడౌన్లను సంబంధిత అధికారులు తనిఖీ చేస్తారని.. అనుమతులు పరిశీలిస్తారని.. నిబంధనల ప్రకారం ఉన్నాయో లేదో చూస్తామని తెలిపారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన మంత్రికి.. ప్రమాదం జరిగిన తీరును అధికారులు వివరించారు.