Hyderabad, DEC 06: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapalli Shankar) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వెలమలపై (Velama) భౌతిక దాడులు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఖబడ్దార్ వెలమల్లారా అంటూ హెచ్చరించారు. కుట్రలు చేసే వెలమల వీపులు విమానాలు మోగుతాయంటూ వార్నింగ్ ఇచ్చారు. వెలమ సామాజికవర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించిన వీర్లపల్లి శంకర్‌పై దోమలగూడ పోలీస్ స్టేషన్‌లో ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం పద్దతి కాదన్నారు.
Shadnagar MLA Controversial Comments
వెలమ నా కొడకల్లరా మిమ్మల్ని సంపి తీరుతాం
షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డికి తెల్వకుండా వెలమ నా కొడుకుల అంతు చూస్తాం.. ఒక్కొక్కని వీపు బాషింగాలు కడతాం pic.twitter.com/5ypa6Xl6gA
— Telugu Scribe (@TeluguScribe) December 6, 2024
ఎమ్మెల్యే వ్యాఖ్యలను వెలమ సంఘం ఖండిస్తోందని.. ఆయన వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వాడిన భాషతో వెలమ సామాజికవర్గ అందరి మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.