Ganja (Photo Credits: ANI)

Hyderabad, Jan 27: హైదరాబాద్‌ నగరంలో మరోసారి విదేశీ గంజాయి (Foreign Ganja) కలకలం సృష్టించింది. నగరంలోని గచ్చిబౌలిలోని ప్రశాంతీ హిల్స్‌ టింబర్‌ లేక్‌ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఓ సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ ను (Techie) ఎక్సైజ్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 170 గ్రాముల విదేశీ గంజాయి, 1 కిలో లోకల్‌ గంజాయి, బైకు, సెల్‌ ఫోల్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని శివరామ్‌ గా గుర్తించారు. అతను బెంగళూరులోని డెలాయిట్‌ కంపెనీలో సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ గా విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి గంజాయిని హైదరాబాద్‌ కు అక్రమంగా తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తెలిపారు.

హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో రెండు బోట్లు, ప్రమాద సమయంలో బోట్స్‌లో 15 మంది

సినీ ఇండస్ట్రీ వాళ్లకు కూడా..

సినీ ఇండస్ట్రీలోని వాళ్లకు కూడా శివరామ్‌ విదేశీ గంజాయి సరఫరా చేసినట్లు తెలుస్తున్నది. మరో సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ అజయ్‌ తో కలిసి శివరామ్‌ మత్తు పదార్థాలను కూడా విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు‌. ప్రస్తుతం అజయ్  పరారీలో ఉన్నాడని చెప్పారు. ఇద్దరూ కలిసి ప్రతీ వారాంతంలో గంజాయి బిజినెస్‌ చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రైవేటు బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు.. వైఎస్ఆర్ జిల్లాలో ఘటన.. సత్యసాయి జిల్లాలో మరో ఘటన (వీడియో)