Hyderabad Rains: నిమజ్జనం సాగుతుండగానే హైదరాబాద్‌లో భారీ వర్షం, పలు చోట్ల ట్రాఫిక్ జామ్, జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని హైదరాబాద్ పోలీసులు సూచన
Hyderabad Rains (Photo-Twitter)

వినాయక నిమజ్జనం జరుగుతున్న వేళ హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా అకస్మాత్తుగా భారీ వర్షం కురుస్తోంది. గురువారం మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి సాయంత్రం 5 గంటల నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని నాంపల్లి, అబిడ్స్‌, కోఠి, బషీర్‌బాగ్‌, బేగంబజార్‌, మాసబ్‌ ట్యాంక్‌, లక్డీకపూల్‌, గోషామహల్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, అప్జల్‌గంజ్‌, హబీబ్‌నగర్‌ సహా పలు ప్రాంతాల్లో భారవ వర్షం కురుస్తోంది.

ఒక్కసారిగా వర్షం కారణంగా వినాయక నిమజ్జనాలకు వెళ్లున్న భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖైరతాబాద్ మహగణపతి, అలాగే బాలాపూర్ గణపతి నిమజ్జనం పూర్తి అయింది. గణేష్ నిమజ్జనం దాదాపు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.

భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

అకస్మాత్తుగా హైదరాబాద్‌లో భారీ వర్షం, పలు చోట్ల ట్రాఫిక్ జామ్, ఇంటికి వెళ్లే వారు అలర్ట్‌గా ఉండాలని పోలీసులు సూచన

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావారణ కేంద్రం తెలిపింది. గురు, శుక్రవారాల్లో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదే విధంగా రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

నిన్న హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరం​లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మేడ్చల్ నుంచి క్రమక్రమంగా మొదలైన వర్షం నగరమంతటా విస్తరించింది. చార్మినార్​, బహదూర్‌​పురా, యాకుత్​పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్​, ఫలక్​నుమా ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

కోఠి, అబిడ్స్​, బేగంబజార్​, నాంపల్లి, బషీర్​బాద్​, లక్డీకాపూల్​, హిమాయత్‌​నగర్​, ట్యాంక్​బండ్​, ఆసిఫ్‌​నగర్​, మెహిదీపట్నం, మాసాబ్​ట్యాంక్, బోరబండ, మోతినగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, మధురానగర్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌​, ఖైరతాబాద్, నిజాంపేట, బాచుపల్లి, గండి మైసమ్మ, కృష్ణాపూర్​, దుండిగల్​, కేపీహెచ్​బీ, మైత్రివనం, మాదాపూర్​, కీసర, మల్కాజిగిరి​ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

తెలంగాణకు ఎల్లో అలెర్ట్‌, రాగల మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం

కుత్బుల్లాపూర్​, జీడిమెట్ల, బాలానగర్​, గుండ్ల పోచంపల్లి, బహదూర్​పల్లి, సూరారం, సుచిత్ర, జగద్గిరి గుట్ట ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పంజాగుట్ట, ఖైరతాబాద్​ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్​నిలిచిపోయింది. ఖైరతాబాద్​రైల్వేగేట్​వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం కలుగుతోంది. యూసఫ్‌​గూడ, శ్రీకృష్ణా నగర్​, పూర్ణ టిఫిన్​సెంటర్​వీధిలోని దుకాణాల్లోకి వరద నీరు చేరుకుంది.

సికింద్రాబాద్, బోయినపల్లి, మారేడుపల్లి, చిలకలగూడ, ప్యాట్ని, పారడైజ్, బేగంపేట్, అల్వాల్ ప్రాంతాలలోనూ భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా పడుతున్న వర్షానికి రహదారులన్నీ జలమమయ్యాయి. ఏకధాటిగా కురుస్తుండడంతో వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. అకస్మాత్తుగా కురిసిన వాన నీరంతా రోడ్లపై నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.