BRS MLC Kavitha arrested under Money Laundering Hawala Act Says ED

Hyd, Mar 22: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో (Supreme Court) నిరాశ ఎదురయింది. తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేయాలని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత (MLC Kavitha) దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం... ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.

తన అరెస్ట్ చట్టవిరుద్దమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ నిర్వహించింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి కవిత లేవనెత్తిన అంశాలను గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు సుప్రీం ధర్మాసనం జత చేసింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను మాత్రమే విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్‌. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ చేసిన ఈడీ...ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ..

పిటిషనర్ ఎవరైనా సరే తాము ఏకరీతి విధానాన్ని అనుసరిస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తాము అంగీకరించబోమని తెలిపింది. బెయిల్ తాము ఇవ్వలేమని, ఎవరైనా కింది కోర్టును మొదట ఆశ్రయించాల్సిందేనని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. 6 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. కవిత కేసు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. కవిత తరపున కపిల్ సిబల్ (Kapil Sibal) వాదనలు వినిపించారు. కవిత అరెస్టుపై కీలక ప్రకటన చేసిన ఈడీ, ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్లు చెల్లించారని వెల్లడి, వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారని తెలిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌

ఈడీ వ్యవహరించిన తీరు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తమను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయని కవిత తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఒకసారి సాక్షిగా, మరోసారి నిందితురాలిగా పిలిచారని తెలిపారు. కవితకు వ్యతిరేకంగా ఒక్క బలమైన సాక్ష్యం కూడా లేదని, అప్రూవర్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు సాగుతోందని పేర్కొన్నారు.

నిపై స్పందించిన ధర్మాసనం.. ప్రస్తుతానికి తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ఇందులో తాము బెయిల్‌ ఇవ్వలేమని, మొదట కింది కోర్టును ఆశ్రయించాల్సిందేనని తెలిపింది. ఆ స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉందన్న ధర్మాసనం.. త్వరితగతిన కేసు విచారణ చేపట్టాలని ట్రయల్‌ కోర్టుకు సూచించింది. ఈ పిటిషన్‌లో రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను లేవనెత్తినందున.. దీన్ని ఇప్పటికే దాఖలైన విజయ్ మదన్ లాల్ కేసుకు జతచేస్తున్నట్లు వెల్లడించింది. రాజ్యాంగ పరమైన అంశాలపై ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని, ఆ తర్వాత మరో రెండు వారాల్లో రిజాయిండర్‌ దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది.

ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సైతం ఈడీ అరెస్టు చేసింది. కేజ్రీవాల్ (Delhi CM Aravind Kejriwal) అరెస్ట్ పై అత్యవసర విచారణకి సుప్రీంకోర్టు అంగీకరించింది.