Delhi, Aug 29: ఢిల్లీ ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి భోపాల్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వేసిన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవై ధర్మాసనం తోసిపుచ్చింది. కేవలం అపోహలతో విచారణను బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేదట్లే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేగాదు ఈ కేసులో విచారణకు ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.
ఈ కేసులోని నిందితుడు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దర్యాప్తు చేసే సంస్థ ఏసీబీని చూసే హోంశాఖ కూడా సీఎం వద్దే ఉందని అందుకే కేసును బదిలీ చేయాలని కోరారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా షాక్, ఏకంగా ఆయన సోదరుడికే నోటీసులు, దుర్గం చెరువు కాలనీలో నోటీసులు అందుకున్నవారిలో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు
Here's Tweet:
ఢిల్లీ: ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి భోపాల్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి వేసిన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవై ధర్మాసనం తోసిపుచ్చింది.
కేవలం అపోహలతో విచారణను బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేదనట్లే
అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ కేసులో… pic.twitter.com/dAlXnZuewI
— BIG TV Breaking News (@bigtvtelugu) August 29, 2024
ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం... కేవలం అపోహలతో బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని తెలిపింది. అలాంటప్పుడు స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఏర్పాటు చేస్తామని ...పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని తెలిపింది. తమకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది ధర్మాసనం అభిప్రాయపడింది.