'Surgical Strikes in Old City': అధికారం ఇవ్వండి..పాతబస్తీలో వారిపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
MP Bandi Sanjay Kumar - Telangana BJP President | File Photo

Hyd, Nov 24: గ్రేటర్‌లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటాపోటీ ప్రచారం సెగలు పుట్టిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి గ్రేటర్‌ పోటీలో బీజేపీ రేసులోకి వచ్చింది. టీఆర్‌ఎస్‌ నేతలకు ధీటుగా ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్ వాసులు ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే పాతబస్తీలో సర్జికల్  స్ట్రైక్ చేస్తామని ('Surgical Strikes in Old City')సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం నగరంలోని ఉప్పల్, రామంతపూర్‌లో సంజయ్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో వివాదాస్పద ప్రసంగం (Surgical strike on Old City) చేశారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ విజయంసాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంర్భంగా మాట్లాడుతూ.. ‘1948లో హైదరాబాద్‌ను పాకిస్తాన్లో కలపాలని ఎంఐఎం కోరింది. బిహార్ ఎన్నికల్లో గెలిచిన ఎంఐఎం ఎమ్మెల్యే.. హిందుస్తాన్ పేరుతో ప్రమాణ స్వీకారం చేయనని చెప్పారు. ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. పాత బస్తీలో ఓట్ కట్టారు పార్టీగా మారింది. ఢిల్లీ మున్సిపాలిటీలో 30 ఏళ్లుగా బీజేపీ గెలుస్తూ వస్తుంది. బీజేపీ గెలిచిన చోట ఎక్కడా మతవిద్వేషాలు లేవు. బీజేపీ చెప్పింది చేస్తుంది. హైదరాబాద్ ఎన్నికల్లో సునామీ రాబోతుంది. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉండదు’ అని అన్నారు.

24 గంటలు మంచినీటి సరఫరా, జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన టీఆర్ఎస్, ప్ర‌జా ర‌వాణాకు పెద్ద‌పీట వేస్తామని తెలిపిన సీఎం కేసీఆర్

బీజేపీ అగ్రనేతలను బరిలోకి దించుతోంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, డీకే అరుణ, రఘునందన్‌రావుతో సహా రాష్ట్ర స్థాయి నేతలంతా హైదరాబాద్‌లో వాలిపోయారు. . కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌, జేపీ నడ్డాతో పాటు మరికొంతమంది నేతలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు మంగళవారం అగ్ర నేతల పర్యటనను సంబంధిం షెడ్యూల్‌ విడుదల కానుంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎ‍న్డీయేను విజయతీరాలకు చేర్చిన భూపేంద్ర యాదవ్‌ ఇప్పటికే నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు.

వైఎస్సార్ అభిమానులు నన్ను క్షమించాలి, ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నాను. దివగంత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మంచి నాయకుడు అన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

మరో మూడేళ్లలో తెలంగాణ అసెంబ్లీ ఎ‍న్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. గ్రేటర్‌ పోరులో ప్రభావం చూపిస్తే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలోపేతం కావొచ్చని ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే అగ్రనేతలను సైతం రంగంలోకి దింపుతోంది. కాగా 150 డివిజన్‌లు ఉన్న గ్రేటర్‌ జీహెచ్‌ఎంసీలో డిసెంబర్‌ 1న పోలింగ్‌ జరుగనుంది. 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.