Suryapet: సూర్యాపేట ర్యాగింగ్ కేసులో ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటు, వసతిగృహం నుంచి విద్యార్థులను శాశ్వతంగా పంపించేస్తూ ఉత్తర్వులు, ఐదుగురు వైద్య విద్యార్థులపై కేసు నమోదు
Representational Image (Photo Credits: stux/Pixabay)

Hyd, Jan 4: సూర్యాపేటలోని Medical Collegeకు చెందిన హాస్టల్ లో ఒక student Raging కు గురైన ఉదంతం కలకలం రేపిన సంగతి విదితమే. విచారణలో సూర్యాపేట మెడికల్‌ కాలేజీ ర్యాగింగ్‌ ఘటన నిజమేనని తేలింది. ర్యాగింగ్‌పై ఏర్పాటు చేసిన కమిటీ హాస్టల్‌లో ర్యాగింగ్‌ (Suryapet Student Ragging Case) జరిగినట్లు నివేదికలో తేల్చింది. ర్యాగింగ్ చేసిన ఆరుగురు విద్యార్థులపై ఏడాదిపాటు సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు డీఎంఈ తెలిపారు.

విద్యార్థులు తక్షణం హాస్టల్‌ ఖాళీ చేయాలంటూ డీఎంఈ ఆదేశించారు. కాగా, ర్యాగింగ్‌ ఘటన సంచలనంగా మారడంతో ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. 2019-20 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఏడాది పాటు సస్పెన్షన్‌ చేస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆరుగురిని హాస్టల్ నుంచి శాశ్వతంగా పంపించేస్తూ ఆయన ఉత్తర్వులు జారీచేశారు.

సూర్యాపేట మెడికల్ కాలేజ్‌లో జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం రేపింది. కాలేజ్ హాస్టల్‌లో ఫస్ట్ ఇయర్ చదువతున్న విద్యార్థి‌ని దాదాపు 25 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. జూనియర్‌ విద్యార్థిని రెండో సంవత్సరం విద్యార్థులు నాలుగు గంటలు గదిలో బంధించి హింసించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సెల్యూట్‌ చేయించుకోవడమే కాకుండా పిడిగుద్దులు గుద్దారు. కన్నీరుపెట్టి వేడుకున్నా వదలకుండా ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు.

కామాంధులా లేక నరరూప రాక్షసులా, బాలిక శవంపై పడి సామూహిక అత్యాచారం, పోస్ట్‌‌మార్టం రిపోర్టులో షాకింగ్ నిజాలు వెలుగులోకి, రాజస్థాన్‌ రాష్ట్రంలో బుండీలో దారుణ ఘటన

టాయిలెట్‌ వస్తుందని అక్కడి నుంచి బయటపడ్డ ఆ విద్యార్థి ఫోన్‌ చేసి విషయం తల్లి దండ్రులకు చెప్పాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దుస్తులు విప్పించి సెల్‌ఫోన్‌లో వీడియో తీయటంతో పాటు దాడికి పాల్పడ్డారని బాధిత విద్యార్థి ఆరోపించారు. కాలేజ్ హాస్టల్లో విద్యార్థులు ఘర్షణ పడిన మాట వాస్తవమేనని, విచారణకు ఆదేశించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్‌రెడ్డి వెల్లడించారు.

ఈ ఘటనపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ (Harish Rao) స్పందించారు. సూర్యాపేట మెడికల్ కాలేజ్‌లో ragging విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఈ రోజు ఉదయమే మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిపారు. కమిటీని ఏర్పాటు చేశామని.. ఈ రోజు మధ్యాహ్నం లోపు రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్టుగా చెప్పారు. ఒకవేళ ర్యాగింగ్ జరిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సంబంధిత విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తాజాగా ర్యాగింగ్ చేసిన ఆరుగురు విద్యార్థులపై ఏడాదిపాటు సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు డీఎంఈ తెలిపారు.

ఈ క్రమంలోనే అధికారులు వేగంగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వైద్య విద్యార్థులపై సూర్యాపేట పోలీసులు సోమవారం కేసు (Anti-Ragging Act ) నమోదు చేశారు. సెకండ్ ఇయర్ వైద్య విద్యార్థులు శ్రవణ్, చాణిక్య, సోహెబ్, ఇన్‌సాఫ్ ఖాణ్, షాహబాజ్‌పై ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు తెలంగాణ ప్రోహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టుగా సూర్యాపేట ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు తెలిపారు. మరికొంత మంది విద్యార్థులను గుర్తించే పనిలో ఉన్నట్టుగా తెలిపారు.