Representational Image (Photo Credits: ANI)

Hyderabad, May 19: అనుమానాస్పద స్థితిలో ట్రాన్స్‌జెండర్‌ మృతి చెందిన ఘటన చైతన్యపురి, కొత్తపేట పోలీసుస్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ బుద్దతండాకు చెందిన వంకునావత్‌ మహేష్‌(23) మూడు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి నివాసం ఉంటున్నాడు. అనంతరం లింగమార్పిడి చికిత్స చేయించుకుని తన పేరును అమృతగా మార్చుకున్నాడు.

రెండేళ్లుగా కొత్తపేటలోనిమోహన్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఏడాదికాలంగా ఎన్‌టీఆర్‌నగర్‌కు చెందిన షేక్‌ జావిద్‌తో సహజీవనంలో ( living relationship) ఉన్నారు.అమృత సోదరుడు కూడా హైదరాబాద్ లోని బడంగ్‌పేటలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం అమృత తన గదిలోని మంచంపై మృతి (suspicious death of transgender) చెందింది.

స‌హ‌జీవ‌నం కరెక్ట్ కాదు, ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట వేసిన పిటిషన్‌పై పంజాబ్‌, హర్యానా హైకోర్టు కీల‌క‌ వ్యాఖ్యలు, యువతి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని పిటిషన్

లింగమార్పిడి సంఘంలో ఒకరైన కిషన్‌ కుటుంబీకులకు ట్రాన్స్‌జెండర్‌ మృతి సమాచారం ఇచ్చారు. ఇటీవల తనను జావేద్‌ హింసిస్తున్నాడని, చేయిచేసుకుంటున్నాడని బడంగ్‌పేటలో నివసించే సోదరుడు శ్రీనుకు ఫోన్‌లో చెప్పిందని శ్రీను తెలిపాడు. ఈ నేపథ్యంలె షేక్‌ జావిద్‌ కొట్టడంతోనే చనిపోయిందని, అమృత మృతిపై (suspicious death) అనుమానాలున్నట్లు ట్రాన్స్‌జెండర్‌ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.