Medigadda Project (Photo-X/TS Congress)

Hyd, Nov 3: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోవడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిమీద విచారణ చేపట్టిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ తన నివేదికను శుక్రవారం సమర్పించింది.డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) నిర్ధారించింది.ఈ మేరకు నాలుగు పేజీల నివేదికను విడుదల చేసింది.

బ్యారేజీ వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి ,.ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని పేర్కొన్న అథారిటీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యారేజ్‌ను ఉపయోగించడానికి అవకాశం లేదని నివేదికలో స్పష్టం చేసింది.బ్యారెజ్ పునాదుల కింద ఇసుక కుంగిపోవడం వల్లే బ్యారేజ్ కుంగిపోయిందని తేల్చింది. బ్యారేజ్ కుంగిపోవడానికి గల అనేక కారణాలను తమ నివేదికలో పొందుపరిచింది.

నేటి నుంచి తెలంగాణ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం, మొత్తం 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎన్నుకోవాలంటూ ఈసీ నోటిఫికేషన్

కాళేశ్వరంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరకొర సమాచారం అందించిదని.. తాము అడిగిన 20 అంశాలకు 11 అంశాలకు మాత్రమే సమాధానం ఇచ్చిందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తన నివేదికలో ఆరోపించింది. ఇన్స్ట్రుమెంటేషన్ , వర్షాకాలం ముందు తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టులు, కంప్లేషన్ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్టులు, థర్డ్ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్‌లపై తెలంగాణ సర్కార్‌ తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఒకవేళ సమాచారాన్ని దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలకు తీసుకునే అవకాశం కూడా తమకు ఉంటుందని డ్యామ్‌ అథారిటీ పేర్కొనడం గమనార్హం.

Here's Report

బ్యారేజ్ ను తేలియాడే నిర్మాణంగా నిర్మించారని, మరమ్మత్తులు పూర్తయ్యేదాకా ప్రాజెక్టులో నీళ్లు నిలుపకూడదని తెలిపింది. బ్యారేజ్ నిర్మాణ సమయంలో అవసరమైన, అధ్యయనాలు పరీక్షలు జరగలేదని తెలిపింది. మేడిగడ్డతో పాటు కాలేశ్వరం ప్రాజెక్టులోని ఇతర నిర్మాణాలను కూడా పరిశీలించాలని నివేదికలో పేర్కొంది. కృంగిపోయిన బ్యారేజీని పునరుద్దించే వరకు చేపట్టాల్సిన చర్యలను కమిటీ నివేదికలో స్పష్టంగా పొందుపరిచింది.

ఇవేం బూతులు బాబోయ్, మంత్రి మల్లారెడ్డి,హరీష్ రావులను మైనంపల్లి హన్మంతరావు ఎలా తిడుతున్నాడో వీడియో ఇదిగో..

మేడిగడ్డ బ్యారేజ్‌ 2019లో నిర్మించబడింది. 2023 అక్టోబర్‌ 21వ తేదీన బ్యారేజ్‌ పునాది భారీ శబ్దంతో కుంగిపోయింది. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (NDSA) మేడిగడ్డ బ్యారేజ్‌ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు.

ఈ కమిటీ అక్టోబర్‌ 24వ తేదీన మేడిగడ్డ డ్యామ్‌ను సందర్శించింది. అక్టోబర్‌ 25వ తేదీన తెలంగాణ ప్రభుత్వం నుంచి 20 అంశాలపై సమాచారాన్ని కోరింది. కానీ, సర్కార్‌ పూర్తి సమాచారం ఇవ్వలేదు. అక్టోబర్‌ 29లోపు పూర్తి డేటాను ఇవ్వకపోతే బ్యారేజీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిందని భావించాల్సి వస్తోందని కమిటీ చెప్పినా కూడా తెలంగాణ సర్కార్‌ పట్టించుకోలేదు.