 
                                                                 Hyd, Dec 15: ఇక మందుబాబులు అలర్ట్ కావాల్సిందే.. తాగి రోడ్ల మీదకు వచ్చినా, లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా జైలుకు వెళ్లక తప్పదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం తాగి వాహనం నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న మందుబాబులపై సైబరాబాద్ పోలీసులు (Cyberabad Traffic Police) స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి 11వరకు 396 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 321 మంది మందుబాబులు ఉండగా.. 74 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న వారు ఉన్నారు.
ఇందులో 33 మంది నిందితులకు కోర్టు జైలు శిక్ష (33 motorists jailed for drunk driving) ఖరారు చేసింది. ఆయా నిందితులకు రూ.16.16 లక్షల జరిమానా (total fine of Rs 16.1 lakh was imposed on traffic violators) విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. మోటార్ వాహన చట్టం సెక్షన్– 19 ప్రకారం ఆయా నిందితుల డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ సంబంధిత రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్టీఓ) అధికారులకు సూచించారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
