TSPSC notifies 1,392 junior lecturer posts

Hyd, Feb 7: తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. వెయిటింగ్‌లో అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.సీఐడీ ఎస్పీగా ఆర్‌ వెంకటేశ్వర్లు, సైబరాబాద్‌ పరిపాలన డీసీపీగా యోగేశ్‌ గౌతమ్‌, పీసీఎస్‌ ఎస్పీగా రంగారెడ్డి, జీఆర్పీ అడ్మిన్‌ డీసీపీగా రాఘవేందర్‌రెడ్డి, వరంగల్‌ పోలీస్‌ శిక్షణా కేంద్రం ఎస్పీగా పూజ, డీజీపీ కార్యాలయం న్యాయవిభాగం ఎస్పీగా సతీశ్‌, వరంగల్‌ నేర విభాగం డీసీపీగా మురళీధర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.గత జనవరిలోనూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 25న రాష్ట్రవ్యాప్తంగా 91 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.

తెలంగాణలో అన్నీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ పూర్తి వివరాలు ఇవిగో, మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష, మే 29 నుంచి జూన్‌1 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు

ఇక తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్‌ హోదా లభించింది. ఐఏఎస్‌ హోదా పొందిన వారిలో.. కాత్యాయని, చెక్కా ప్రియాంక నవీన్‌ నికోలస్‌, కోరం అశోక్‌ రెడ్డి, బడుగు చంద్రశేఖర్‌ రెడ్డి, వెంకటనరసింహ రెడ్డి, అరుణ శ్రీ, హరిత, కోటా శ్రీవాస్తవా, నిర్మల కాంతివేస్లీ ఉన్నారు.