Coronavirus in India | File Image | (Photo Credits: PTI)

Hyd, Nov 19: తెలంగాణలో గత 24 గంటల్లో 1,058 కరోనా కేసులు (Covid in TS) నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,440 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,60,834 కి (telangana corona cases) చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,46,733 మంది డిశ్చార్జ్ అయ్యారు.

మృతుల సంఖ్య మొత్తం 1,419 కి (Covid Deaths) చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 12,682 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 10,352 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 91 కేసులు నిర్ధారణ అయ్యాయి.

విపక్షాలకు దిమ్మతిరిగేలా గ్రేటర్‌లో విజయం సాధిస్తాం, ధీమా వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్, అభ్యర్థుల తొలి జాబితా రెడీ, బీజేపీలో చేరిన కాంగ్రెస్ కీలక నేత, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి

దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 89 లక్షల 58 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 45,576 పాజిటివ్‌ కేసులు (India Coronavirus) నమోదు కాగా 585 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 89,58,483కు చేరగా.. మరణాల సంఖ్య 1,31,578కు (Covid Deaths) చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,43,303 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే 44,493 మంది కోలుకోగా ఇప్పటి వరకు 83,83,602 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 93.58గా ఉండగా, మరణాల రేటు 1.47శాతానికి తగ్గింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4.95 శాతంగా ఉంది.