
Hyderabad, Jan 20: కరోనావైరస్ వ్యాక్సిన్ వారియర్లకు ఇస్తున్న నేపథ్యంలో పలు చోట్ల కొన్ని విషాదకర ఘటనలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఇద్దరు చనిపోయారు. వారి మరణానికి కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధం లేదని వైద్యులు చెబుతున్నారు. తాజాగా తెలంగాణ జిల్లాలో మరో విషాదకర వార్త బయటకు వచ్చింది. తెలంగాణలో నిర్మల్ జిల్లాలోని కుంటాల పీహెచ్‌సీలో పని చేస్తున్న హెల్త్ కేర్ వర్కర్ కరోనా వ్యాక్సిన్ (Covid Vaccination in TS) తీసుకున్న మరుసటి రోజు చనిపోయాడు.
నిర్మల్ జిల్లా, కుంటాల మండలానికి చెందిన విఠల్ 108 అంబులెన్స్ డ్రైవర్‌గా ( Ambulance Driver) పని చేస్తున్నాడు. కోవిడ్ వ్యాక్సినేషన్ (Covid Vaccination) కార్యక్రమంలో భాగంగా మంగళవారం కుంటాల పీహెచ్‌సీలో విఠల్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఇక రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. విఠల్ మృతి చెందాడు.

అయితే విఠల్ మృతిపై ప్రజా డైరెక్టర్ అప్ పబ్లిక్ హెల్త్ స్పందించారు. గుండెపోటుతో ఆయన మరణించారని ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాక్సిన్ కు సంబందం లేదన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలిపారు. మరణంపై విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుదవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఇద్దరు మృతి, కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల చనిపోలేదంటున్న వైద్యులు
42 ఏండ్ల వయసున్న హెల్త్ కేర్ వర్కర్ 19వ తేదీన ఉదయం 11:30 గంటలకు కొవిడ్ టీకా తీసుకున్నాడు. 20వ తేదీ అర్ధరాత్రి 2:30 గంటలకు అతనికి ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు అదే రోజు తెల్లవారుజామున 5:30 గంటలకు నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆ వర్కర్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.