Hyderabad, Sep 15: దేశ వైద్యరంగంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది. తెలంగాణ (Telangana) వేదికగా శుక్రవారం ఈ రికార్డు నమోదు కానున్నది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో (Govt. Medical Colleges) తరగతులు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో తరగతులను సీఎం కేసీఆర్ (CM KCR) వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పండుగ వాతావరణంలో నిర్వహించనున్నది. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లాకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఇటీవల మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కనీసం 15-20 వేల మందితో జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు తీయనున్నారు. ఇందులో పెద్ద ఎత్తున యువతను, విద్యార్థులను భాగస్వాములు చేయనున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో విద్యార్థులకే కాకుండా దానికి అనుబంధంగా అందుబాటులోకి వచ్చే దవాఖానతో ప్రజలకు ఎలాంటి అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతాయో తెలియజేయనున్నారు.
తెలంగాణలో నేడు కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో 9 మెడికల్ కాలేజీలు వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ pic.twitter.com/92661W4FAW
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2023
నేడు ఒకేసారి తెలంగాణాలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం. #Telangana pic.twitter.com/WDj8oJg2I8
— Actual India (@ActualIndia) September 15, 2023
ఏయే జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అంటే?
కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం
ఏపీలోనూ మెడికల్ కాలేజీలకు శ్రీకారం..
రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రాష్ట్రంలోని ఐదు మెడికల్ కళాశాలల ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి జగన్. విజయనగరం జిల్లాలో ఇవాళ సీఎం జగన్ పర్యటించనున్నారు. విజయనగరం మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను వర్చువల్గా ప్రారంభిస్తారు.