CM Revanth Reddy on Telangana Caste Census(CMO X)

Hyderabad, Feb 4: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly Session) నేడు ప్రత్యేకంగా సమావేశం కానునున్నది. కులగణన, ఎస్సీ (SC) వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించి అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో వీటిపై చర్చించాలని భావించారు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఈ నెల 1వ తేదీన వెల్లడించారు. అయితే ఒక రోజు ముందుగానే అంటే ఈ నెల 4వ తేదీనే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బీసీ సబ్ కమిటీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ నివేదికను కేబినెట్‌ కు అందజేస్తారు. కుల గణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై చర్చించి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటుంది. క్యాబినెట్ సమావేశం అనంతరం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభ, శాసనమండలిలో ఈ రెండు నివేదికలను ప్రవేశపెట్టి చర్చిస్తారు.

అండ‌ర్‌-19 టీ20 వ‌ర‌ల్డ్‌ క‌ప్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ' హైద‌రాబాద్ కు.. తెలుగ‌మ్మాయి త్రిష‌కు ఘ‌న స్వాగ‌తం.. ఇదిగో వీడియో!

46.25 శాతం బీసీలు, 12.56 శాతం ముస్లింలు

తెలంగాణ సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అధ్యక్షతన కులగణపై కేబినెట్ సబ్‌ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా కేబినెట్‌ సబ్‌ కమిటీకి కులగణన నివేదికను ప్లానింగ్‌ కమిషన్‌ అధికారులు ఇచ్చారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 96.9 శాతం కులగణన సర్వే జరిగిందని.. 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదన్నారు.

నేడు రథ సప్తమి.. తిరుమల, అరసవల్లిలో సంబురాలు.. పోటెత్తిన భక్తులు (వీడియో)

కులగణన రిపోర్టు..

  • తెలంగాణలో కుల గణన సర్వే చేసిన జనాభా 3,54,77,554
  • మొత్తం కుటుంబాలు 1,12,15,134
  • కుల గణన ప్రకారం ఎస్సీల జనాభా - 61,84,319.. (17.43 శాతం)
  • ఎస్టీల జనాభా - 37,05,929.. (10.45 శాతం )
  • బీసీల జనాభా - 1,64,09,179 (46.25 శాతం)
  • ముస్లింల జనాభా- 44,57,012 (12.56 శాతం)
  • బీసీ ముస్లింలు: 35,76,588 (10.08 శాతం)
  • ఓసీ ముస్లింలు: 8,80,424 (2.48 శాతం)
  • ఓసీల జనాభా- 44,21,115 (13.31 శాతం)
  • మొత్తం ఓసీ జనాభా - 15.79 శాతం