telangana-assembly-sessions New International Cricket Stadium for Hyderabad says CM Revanth Reddy

Hyderabad, Dec 9: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (TG Assembly Session Today) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశాలు మొదలు కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏడాది పాలన పూర్తి చేసుకొని ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. రైతుల సమస్యలు, గురుకులాల్లో నెలకొన్న ఇబ్బందులు, లగచర్ల భూ సేకరణ సమస్య, ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటుపై వస్తున్న వ్యతిరేఖత తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరుకున పెట్టే అవకాశం ఉంది. సమావేశాలు వారం, పది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. శాసనసభ సమావేశాల్లో ఏయే అంశాలు చర్చకు పెట్టాలి? ఏయే అంశాలు బిల్లుల రూపంలో సభలో పెట్టాలి? అన్నది బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

తెలంగాణ త‌ల్లి విగ్ర‌హంపై కేసీఆర్ స్పంద‌న ఇదే! రేవంత్ స‌ర్కారు తీరుపై ఫిబ్ర‌వ‌రిలో భారీ బ‌హిరంగ స‌భ‌

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం

నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండటంతో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో త్వరగా ఉభయ సభలు వాయిదా పడే అవకాశం ఉంది. శాసనసభలో మొదటి రోజైన ఇవాళ ఉభయ సభల ముందు ఆర్డినెన్స్‌ లను పెట్టనున్నారు.

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే-ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ చీఫ్ దిశానిర్దేశం 

5 బిల్లులు - 2 నివేదికలు

జీతాలు, పింఛను చెల్లింపు, అనర్హతల తొలగింపు ఆర్డినెన్స్‌, పురపాలక సంఘాల ఆర్డినెన్స్‌, హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఆర్డినెన్స్‌, జీఎస్టీ ఆర్డినెన్స్‌, పంచాయతీ రాజ్​ ఆర్డినెన్స్​లను సభ ముందు పెట్టనున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్తు, ఆర్థిక సంస్థ లిమిటెడ్‌ 9వ వార్షిక నివేదిక.. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ 7వ వార్షిక నివేదికను సభ ముందు పెట్టనున్నట్టు సమాచారం.