జనగామలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాదయాత్ర సందర్భంగా దేవరుప్పుల టీఆర్‌ఎస్ నాయకులు.. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం.. బీజేపీ నాయకులపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో, వారి మధ్య వాగ్వాదం నెలకొంది. రాళ్ల దాడిలో కొందరు నేతలు తలలు పగిలిపోయాయి. రక్తం కారడంతో అంబులెన్స్‌లో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బండి సంజయ్.. విధుల్లో ఉన్న సీపీ ఏం చేస్తున్నాడంటూ సీరియస్ అయ్యారు.
#WATCH | Telangana: Clash b/w BJP & TRS workers during state BJP chief Bandi Sanjay Kumar's Praja Sangrama Yatra, in Jangaon. Injuries reported
Police say, "Both parties attacked each other.Police brought situation under control. If we receive complaint, case will be registered" pic.twitter.com/XB7lSfdoA7
— ANI (@ANI) August 15, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)