Hyderabad, Oct 27: తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ (TS Intermediate Exams) ఫీజు (Fee) చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు (Inter Board) తాజాగా విడుదల చేసింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకూ ఎటువంటి జరిమానా లేకుండా ఫీజులు చెల్లించవచ్చని పేర్కొంది. ఈ గడువు లోపు ఫీజు చెల్లించలేకపోయిన వారు నవంబర్ 16-23 మధ్య రూ.100 జరిమానాతో కలిపి ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది.
Inter Exam Fee | ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల. https://t.co/kAcfwGllr1
— Namasthe Telangana (@ntdailyonline) October 26, 2023
జరిమానా ఇలా..
- నవంబర్ 16-23 మధ్య చెల్లిస్తే రూ.100 జరిమానా
- నవంబర్ 25-డిసెంబర్ 4 మధ్య రూ.500 ఫైన్
- డిసెంబర్ 6 నుంచి 13 మధ్య చెల్లిస్తే రూ.1000 ఫైన్
- డిసెంబర్ 15-20 మధ్య చెల్లిస్తే రూ.2 వేల జరిమానా