Telangana Budget Session 2021: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు, మార్చి 18న అసెంబ్లీలోకి తెలంగాణ బడ్జెట్‌, 20 నుంచి బడ్జెట్‌, పద్దులపై చర్చ, మాస్క్‌ లేకుంటే సభకు రావద్దని తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‎రెడ్డి
Telangana Assembly Budget Session 2020 congress-mlas-suspend-from-telangana-assembly cm-kcr-fire-on-congress-party-legislatures (Photo-Twitter)

Hyderabad, Mar 15: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (Telangana Budget Session 2021) తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ( Tamilisai Soundararajan) ప్రసంగిచనున్నారు. అనంతరం సభా నిర్వహణపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy ) అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. అనంతరం చనిపోయిన సభ్యులకు మంగళవారం సంతాప తీర్మానాలు ఉంటాయి.

గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై 17న చర్చ, సమాధానం, ఈ నెల 18న బడ్జెట్‌ 2021-2022 సమర్పణ, 20 నుంచి బడ్జెట్‌, పద్దులపై చర్చ ఉంటాయి. గత శాసనసభ సమావేశాల్లో అమలు చేసిన కొవిడ్‌ నిబంధనలే ఈ సమావేశాల్లోనూ అమల్లో ఉంటాయని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‎రెడ్డి స్పష్టం చేశారు.

మాస్క్‌ లేకుంటే సభకు రావద్దని చెప్పా రు. కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్న వారికి సభా ప్రాంగణంలోనికే అనుమతి లేదన్నారు. అసెంబ్లీలో కొవిడ్‌ పరీక్షలు శుక్రవారం నుంచే నిర్వహిస్తారు. కాగా.. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ సమావేశంలో జరగనుంది. కరోనా నేపథ్యంలో సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభ్యులతో సహా అసెంబ్లీ సిబ్బంది, మార్షల్స్‌, మీడియా ప్రతినిధులకు ర్యాపిడ్‌ టెస్టులు చేస్తున్నారు.

విశాఖ ఉక్కుతో నీకేం పని అంటారా ? మేం ముందు భారతీయులమని తెలుసుకోండి, బీజేపీపై మండిపడిన తెలంగాణ మంత్రి కేటీఆర్, విశాఖ ఉక్కు దీక్షా శిబిరానికి మంత్రిని ఆహ్వానించిన ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు

ప్రతిరోజూ అసెంబ్లీ ఆవరణను రెండుసార్లు శానిటైజేషన్‌ చేస్తారు. భద్రతా ఏర్పాట్లపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలతోపాటు గత సమావేశాల్లో జీరోఅవర్‌లో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు అందజేయాలని స్పీకర్‌ ఆదేశించారు