CM KCR Press Meet Highlights (Photo-Twitter.CMO Telangana)

Hyd, July 11: తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల ప‌రిస్థితిపై సీఎం కేసీఆర్ అధికారుల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో (Telangana Rains) తీసుకోవాల్సిన‌ రక్ష‌ణ చ‌ర్య‌ల‌పై మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను కేసీఆర్ (CM KCR) అడిగి తెలుసుకున్నారు. గోదావ‌రి, ఉప న‌దుల్లో వ‌ర‌ద ప‌రిస్థితిపై ఆరా తీశారు. అవ‌స‌ర‌మైన చోట తీసుకోవాల్సిన త‌క్ష‌ణ చ‌ర్య‌ల‌పై అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొవ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని సీఎం ఆదేశించారు. కుంట‌లు, చెరువులు, డ్యాంలు, రిజ‌ర్వాయ‌ర్ల‌కు వ‌స్తున్న వ‌ర‌ద‌పై ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు తెలుసుకొని, చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

షాకింగ్ వీడియో.. వరదల్లో చిక్కుకుని 30 మంది విద్యార్థుల ఆర్తనాదాలు, అండర్‌ బ్రిడ్జి వద్ద వరద నీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు, డ్రైవర్‌ అప్రమత్తమవడంతో తప్పిన పెను ప్రమాదం

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పైళ్ల శేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ రావు, సీఎంవో కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిజి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.