CM KCR Vasalamarri Tour (Photo-Video Grab)

Vasalamarri, June 22: తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన (CM KCR Vasalamarri Tour) కొనసాగుతోంది. కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో గ్రామస్తులందరితో (Vasalamarri village people) సహపంక్తి భోజనం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రసంగించారు. వాసాలమర్రిని సీఎం కేసీఆర్‌ ( Telangana CM KCR) దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. వాసాలమర్రికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వాసాలమర్రికి మరో 20 సార్లు వస్తానని కేసీఆర్‌ పేర్కొన్నారు. గ్రామ రూపరేఖలు మారాలని, అభివృద్ధి పనులు జరగాలన్నారు. అందరం కలిసి ఏడాది కల్లా బంగారు వాసాలమర్రి కావాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఒక్క పోలీసు కేసు కూడా నమోదు కావొద్దని, ఏదైనా సమస్య వస్తే అందరూ కలిసి పరిష్కారం చేసుకోవాలని సూచించారు.

ఊరికి కేవలం ట్రాక్టర్లు ఇచ్చి వెళ్లిపోతే సరిపోదన్నారు. వాసాలమర్రిలో ఒక ప్రత్యేకమైన పని జరగాలని చెప్పారు. వాసాలమర్రికి మరో 20 సార్లు వస్తానని వ్యాఖ్యానించారు. వాసాలమర్రిలో కేవలం నలుగురే తనకు పరిచయమయ్యారన్నారు. ఈ గ్రామం ఏడాదిలో బంగారు వాసాలమర్రి కావాలని సూచించారు. ఊరిలో పోలీసు కేసులు ఉండకుండా చేయాలని, సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. వాసాలమర్రి రూపురేఖలు మారాలని పేర్కొన్నారు.

వరంగల్‌ అర్బన్‌‌కు హన్మకొండ జిల్లా, వరంగల్‌ రూరల్‌కు వరంగల్‌ జిల్లాగా పేర్లు మార్చిన సీఎం కేసీఆర్, రెండు, మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు, వరంగల్‌లో కరువు మాయం కావాలని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి

ఊరిలో ఒకరంటే మరొకరికి ప్రేమ ఉండాలన్నారు. గ్రామస్తుల మధ్య ఐకమత్యం ఉండాలని పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని సూచించారు. అంకాపూర్‌లో గ్రామ అభివృద్ధి కమిటీ ఉందన్నారు. సాక్ష్యాత్తు గ్రామ సర్పంచ్‌కి కూడా ఫైన్‌ వేశారని గుర్తు చేశారు. గ్రామంలో ప్రతి దళితవాడకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటానని కేసీఆర్‌ తెలిపారు.

Here's CM KCR Vasalamarri Tour Updates

‘చుట్టపక్కల గ్రామాలన్నీ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. అందరూ కలిసి శ్రమిస్తే ఏదైనా సాధ్యం అవుతుంది. అంకాపూర్‌కు వెళ్లొచ్చి చూశారు కదా.. అక్కడ బంగారు భూమి లేదు. అంకాపూర్‌లో బిల్డింగ్‌లు ఎలా ఉన్నాయ్‌. అక్కడ ఉన్నది రైతులే.. అంకాపూర్‌లో గ్రామాభివృద్ధి కమిటే సుప్రీంకోర్టు. సర్పంచ్ తప్పు చేసినా ఆ గ్రామ కమిటే ఫైన్ వేస్తుంది. 45 ఏళ్లుగా అంకాపూర్‌కు పోలీసులు వెళ్లాల్సిన అవసరం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వమే అండగా ఉంటే మీకు అన్నీ జరుగుతాయి.

అభివృద్ధి జరగాలంటే మహిళలే ముఖ్యం. మీరు పట్టుబడితే, ఆలోచన చేస్తే ఊరు బాగుంటుంది. 1500 మంది వారానికి రెండు గంటలు ఊరి కోసం పనిచేస్తే మారదా. ఆరోజు నుంచి వాసాలమర్రి నా ఊరే. గ్రామంలో ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి. వాసాలమర్రిలో కమ్యూనిటీ హాల్‌ కట్టుకుందాం. వాసాలమర్రి గ్రామస్తులు ఐక్యంగా ఉండి అభివృద్ధి చేసుకోవాలి. కులాలు, పార్టీలకతీతంగా అభివృద్ధి చేద్ధాం.’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

గ్రామాభివృద్ధికి ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌ను నియమిస్తున్నా. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 421 గ్రామపంచాయతీలకు సీఎం నిధి నుంచి ఒక్కో పంచాయతీకి రూ.25లక్షలు చొప్పున మంజూరు చేస్తున్నా. జిల్లాలోని 6 మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున మంజూరు చేస్తున్నా’’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.