CM KCR Visits Gandhi Hospital: నేనున్నా..ధైర్యంగా ఉండండి, సీఎం హోదాలో తొలిసారిగా గాంధీ ఆస్పత్రికి కేసీఆర్, వైద్య సేవల గురించి ఆరా, ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న తెలంగాణ సీఎం

Hyderabad, May 19: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తొలిసారిగా సీఎం హోదాలో గాంధీ ఆస్పత్రిని (CM KCR visits Gandhi Hospital) సందర్శించారు. స్వయంగా కేసీఆర్‌ గాంధీ ఆస్పత్రిలో పరిస్థితిని పరిశీలించారు. అనంతరం గచ్చిబౌలి టిమ్స్‌కు సీఎం కేసీఆర్‌ వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్‌ (Telangana CM KCR) దగ్గర ఉంది.

గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 1500 మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో సుమారు 18 వందలకుపైగా బెడ్లు ఉన్నాయి. కరోనా వార్డుల్లో పేషెంట్లను సీఎం కేసీఆర్‌ పరామర్శించి ధైర్యం చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందిని కేసీఆర్‌ అభినందించారు.కరోనా ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారితో స్వయంగా మాట్లాడిన సీఎం కేసీఆర్, ధైర్యంగా ఉండాలని వారికి చెప్పారు. వారిని అడిగి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు.

తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభమయ్యేనా? టీఎస్‌పీఎస్‌సీ నూతన చైర్మన్‌గా జనార్ధన్ రెడ్డి నియామకం, ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన గవర్నర్

దాదాపు 40 నిమిషాల పాటు గాంధీ ఆసుపత్రిలో ఉన్న సీఎం కేసీఆర్.. కరోనా చికిత్స ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు, సీఎస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు. కాగా, సీఎం హోదాలో గాంధీ ఆసుపత్రిని కేసీఆర్ సందర్శించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం వైద్య ఆరోగ్య, శాఖ బాధ్యతలను (Health MInistry) కేసీఆర్ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.

Here's CM KCR visits Gandhi Hospital Video

గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో చర్చించారు. మెరుగైన వైద్య చికిత్సపై ప్రధానంగా చర్చించారు. ఆసుపత్రిలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి? వెంటిలేటర్ పరిస్థితి, ఆక్సిజన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ఆవరణలో రసాయనాలు పిచికారీ చేయడంతో పాటు రోగుల బంధవులను అక్కడి నుంచి తరలించారు.