TS CM KCR | Photo: IPR Telangana

Hyderabad, August 4: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు (CM KCR Vasalamarri Tour) పర్యటించారు. గ్రామంలోని దళితవాడల్లో సీఎం కేసీఆర్ పర్యటించి అక్కడి వివరాలు తెలుసుకున్నారు. దళితవాడలో కాలినడకన ఇంటింటికి వెళ్లి ‘దళితబంధు’ పథకం (Telangana Dalitha Bandhu) గురించి ఏ మేరకు అవగాహన ఉందో దళితులను అడిగి తెలుసుకున్నారు. ‘దళిత బంధు’ పథకంతో వచ్చే పెద్ద మొత్తం డబ్బుతో ఎలాంటి ఉపాధి పొందుతారని దళితులను అడిగి తెలుసుకున్నారు.

పెద్ద మొత్తంలో వచ్చే డబ్బును వృధా చేసుకోవద్దని స్పష్టమైన అవగాహనతో దళిత బందు ద్వారా లబ్ధి పొందాలని సీఎం సూచించారు. సుమారు గంటకుపైగా దళితవాడల్లో కాలినడకన కలియతిరిగారు. గ్రామమంతా కలియతిరిగి మొత్తం పరిశీలించారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్తులతో కూడా మాట్లాడారు. అనంతరం గ్రామ అభివృద్ధిపై రైతు వేదికలో గ్రామస్తులతో సమావేశం కానున్నారు. వాసాలమర్రికి సీఎం కేసీఆర్‌ రావడం ఇది రెండోసారి.

తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం, ఆగస్ట్‌ 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్‌, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్‌ పరీక్షలు, ఒక్క నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ

గత జూన్‌ 22న తొలి‌సా‌రిగా వాసా‌ల‌మ‌ర్రికి వచ్చిన ముఖ్య‌మంత్రి.. గ్రామ‌స్థు‌లతో కలిసి గ్రామా‌భి‌వృ‌ద్ధిపై చర్చించి అనం‌తరం సహ‌పంక్తి భోజనం చేశారు. 42 రోజుల తర్వాత సీఎం మరో‌సారి గ్రామా‌నికి వ‌చ్చారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.