Hyd, Mar11: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Telangana CM KCR) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యాదాద్రి పర్యటన రద్దు చేసుకున్న ఆయన.. హుటాహుటిన యశోద ఆస్పత్రికి (Yashoda Hospital) వెళ్లారు. ఆస్పత్రిలో ఆయన సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. రెండురోజులుగా ఆయన వీక్‌గా ఉన్నారని, ఎడమ చేయి లాగుతోందని చెప్తున్నారని డాక్టర్ ఎంవీ రావు వెల్లడించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌కు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
కేసీఆర్ వెంట ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. మరోవైపు యశోద ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. Telangana CM KCR షెడ్యూల్ ప్రకారం ఇవాళ యాదాద్రిలో పర్యటించాలని అనుకున్నారు. అయితే, అస్వస్థతోనే ఆయన పర్యటన రద్దైనట్లు తెలుస్తోంది. దీంతో నేడు జరగాల్సిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి తిరుకల్యాణ మహోత్సవానికి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకానున్నట్లు సమాచారం. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.