CM Revanth Reddy on progress report of Congress Party MLAs(X)

Hyd, January 2:  పాత, కొత్త నాయకులు అందరూ కలిసి పనిచేయాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకొని పనిచేయాలని...ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా స్వయంగా పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి శుభాకంక్షలు చెప్పారు సీఎం.

ఈ సందర్భంగా కీలక సూచన చేశారు. మాట నిలబెట్టుకుందామని, కష్టపడి పనిచేద్దామని అన్నారు. నేను మారాను.. మీరూ మారండి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని వెల్లడించారు ముఖ్యమంత్రి. కాంగ్రెస్‌లో చాలా వలసలు ఉన్నాయి...వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలకు సమయం కేటాయించండన్నారు.

సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరుపై సర్వే రిపోర్టులు నా దగ్గర ఉన్నాయి...నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించాను అన్నారు. అందరికీ ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాను,ఏడాది పాలన అనుభవాలు, వచ్చే నాలుగేళ్లు ఉపయోగపడతాయి అన్నారు రేవంత్ రెడ్డి. ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తా....స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత, కొత్త నాయకులు అందరూ కలిసి పనిచేయాలన్నారు. మేడ్చల్ టూ శామీర్‌ పేట..మెట్రో విస్తరణ, సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర కానుక,మూడు నెలల్లో డీపీఆర్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు 

మనకు తెలిసి ఏ తప్పు చేయలేదు, కానీ జరిగిన తప్పులను సరి చేసుకున్నాం... మార్పు కోసమే తమకు ప్రజలు అధికారం ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల వాతావరణం ఉందని ... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలు గుర్తించారని, ప్రభుత్వ ఇబ్బందులను అర్థం చేసుకుంటున్నారని తెలిపారు.బీఆర్ఎస్ దుష్పచారాన్ని తిప్పికొట్టాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.