Revanth Reddy as New Telangana CM (Photo-X)

Hyd, Dec 7: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం చేయనున్నారు.ఆయనతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక రేవంత్‌రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకుని.. తన చాంబర్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పాలన పరిస్థితులు, ఇతర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది.

ఆయనతో పాటు కొంతమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనునున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. నేడు మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి ముఖ్యనేతలుగా ఉన్న ముగ్గురికీ కేబినెట్‌లో చోటు దక్కింది. మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

కొలువుదీర‌నున్న కాంగ్రెస్ స‌ర్కార్, ప్ర‌మాణ‌స్వీకారం దృష్ట్యా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, ఈ రూట్ల‌లో వ‌చ్చేవారు ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో రావాలంటూ సూచ‌న‌

నల్గొండ జిల్లా నుంచి ఊహించిన విధంగానే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అవకాశం కల్పించారు. వీరితో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖ, ఉమ్మడి కరీంనగర్‌ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ఉమ్మడి నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి, మెదక్‌ జిల్లా నుంచి దామోదర్‌ రాజనర్సింహ, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నుంచి జూపల్లి కృష్ణారావు కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. మంత్రివర్గ జాబితాలో ఉన్న వారికి రేవంతే స్వయంగా ఫోన్‌ చేస్తున్నారు.మంత్రి పదవికి ఎంపిక చేసిన నేతలకు కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్ రావు ఠాక్రే ఫోన్ చేసి అభినందించినట్లు సమాచారం.

ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వీళ్లే..

భట్టి విక్రమార్క (ఉప ముఖ్యమంత్రి)

శ్రీధర్ బాబు

ఉత్తమ్ కుమార్ రెడ్డి

సీతక్క

కోమటి రెడ్డి వెంకట రెడ్డి

తుమ్మల నాగేశ్వర్ రావు

పొన్నం ప్రభాకర్

కొండా సురేఖ

దామోదర రాజనర్సింహ

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

జూపల్లి కృష్ణారావు

సుదర్శన్‌రెడ్డి