Gaddam Vinod: మాజీ మంత్రి మొబైల్ నుంచి అశ్లీల వీడియో బయటకు, ఆ వీడియోతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కాంగ్రెస్‌ నేత గడ్డం వినోద్

Hyd, Oct 6: తెలంగాణ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి గడ్డం వినోద్‌ సెల్‌ఫోన్‌ నుంచి ఓ అశ్లీల వీడియో మంచిర్యాల జిల్లా వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేయడం జిల్లాలో కలకలం రేపింది. వాట్సాప్ గ్రూపులో ఎవరు పోస్టు చేశారో తెలియకపోయినా మాజీ మంత్రి వినోద్ ఫోన్‌ నుంచి ఈ వీడియో బయటకు రావడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ విషయం మాజీ మంత్రి వినోద్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

వీడియో ఇదిగో, మా తాత ముత్తాతలు హిందూస్తాన్లో పుట్టారు, రాహుల్ గాంధీ మీ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది? రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన అక్బరుద్దీన్ ఒవైసి

తనకున్న రెండు సెల్‌ఫోన్లలో ఒకటి తన వద్ద, మరొకటి డ్రైవర్‌ వద్ద ఉంటాయని ఆయన తెలిపారు. డ్రైవర్‌ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తానెప్పుడూ వినియోగించలేదని, డ్రైవర్‌ తప్పిదంతో జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆ అశ్లీల వీడియోతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. డ్రైవర్‌ తప్పిదంతో జరిగిన పొరపాటును రాజకీయం చేయడం బుద్ధి జీవుల లక్షణం కాదని.. విజ్ఞతతో ఆలోచించాలని వినోద్‌ కోరారు.