Telangana High Court: తెలంగాణ కోర్టులకు సెప్టెంబర్ 5 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, అత్యవసర కేసులు విచారణ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు
High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, August 11: తెలంగాణలో క‌రోనా వైర‌స్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ హైకోర్టు కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. కోర్టులకు (Telangana Courts) లాక్‌డౌన్‌ను మ‌రోసారి పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని కోర్టులు, ట్రిబ్యునల్‌లకు లాక్‌డౌన్‌ను సెప్టెంబర్‌ 5 వరకు పొడిగిస్తున్నట్టు (Lockdown Extension) హైకోర్టు ప్రకటించింది. అత్యవసర కేసులు విచారణను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఆన్‌లైన్‌తో పాటు నేరుగా కోర్టుల్లో పిటిషన్‌లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని హైకోర్టు (Telangana High Court) తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర జిల్లాలలోని కోర్టుల్లో నేరుగా పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. కోర్టుల వద్ద శానిటైజేషన్, మాస్కులు, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.   కోవిడ్-19తో డీఎస్పీ మృతి, మృతి చెందిన వారి అంత్యక్రియల్లో పాల్గొంటే కరోనా రాదని తెలిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1896 కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మంగళవారం నాటికి 82 వేలు దాటాయి. కరోనాతో గత 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. దీంతో మరణించిన వారి సంఖ్య 645కి చేరుకొంది.

న్యాయ స్థానాల్లో ఆగ‌ష్టు 15 వేడుక‌ల‌పై తెలంగాణ హైకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. స్వాతంత్య్ర వేడుక‌ల్లో పాల్గొనే వారికి 50 మందికి మించ‌రాద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే 20 నిమిషాల్లో వేడుక‌ను పూర్తి చేయాల‌ని వెల్ల‌డించింది. సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని హైకోర్టు పేర్కొంది. న్యాయ స్థానాల్లో నిర్వ‌హించే ఆగ‌ష్టు 15 వేడుక‌ల్లో ఖ‌చ్చితంగా మాస్కులు ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని, శానిటైజ్ రాసుకోవాల‌ని ఇత‌ర కోవిడ్ నిబంధ‌న‌లను ఖ‌చ్చితంగా పాటించాల‌ని సూచించింది.