Mancherial, Oct 26: బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నానన్న విషయాన్ని మరచి ఫుల్ గా మద్యం సేవించిన ఓ ఎస్‌ఐ (Drunken SI Creates Ruckus), అతని స్నేహితులు మంచిర్యాలలో వీరంగం సృష్టించారు.జిల్లాలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్‌ఐ తిరుపతి, తన స్నేహితులు హల్ చల్ చేశారు. మంచిర్యాల జిల్లా వేంపల్లికి చెందిన తిరుపతి కమిషనరేట్ పరిధిలోని బెజ్జంకి పీఎస్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం రాత్రి ఎస్సై తిరుపతి తన స్నేహితులో కలిసి మద్యం సేవించారు.
మద్దం మత్తులో అర్థరాత్రి రోడ్డుపై ఓ వ్యక్తితో గొడవకు (SI creates ruckus along with friends) దిగాడు. దీంతో వీరిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న బ్లూకోట్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎస్సైతోపాటు అతని స్నేహితులు బ్లూకోట్ కానిస్టేబుళ్లపై దాడి చేశారు. వారి వద్ద ఉన్న ట్యాబ్‌లను ధ్వంసం చేశారు.
స్కూల్లో గుండెపోటుతో కుప్పకూలిన మూడో తరగతి విద్యార్థి, రాజన్న సిరిసిల్లాలో విషాదకర ఘటన
పోలీసులపై దాడిని స్థానికులు అడ్డుకోవడంతో కారు వదిలి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఎస్సై దాడిలో నలుగురు బ్లూకోట్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు. అనంతరం వీరంగం సృష్టించిన ఎస్సై కారును పోలీస్ స్టేషన్‌కు తరలించి, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.