Revanth Reddy and errabelli dayakar rao (Phoot-Video Grabs)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన సోదరుడు ఓటమి పాలయ్యారు. ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు బీఆర్‌ఎస్‌ నుంచి పాలకుర్తి ఎమ్మెల్యేగా మరోసారి బరిలోకి దిగారు. ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌కుమార్‌ రావు వరంగల్‌ ఈస్ట్‌ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగారు.

పాలకుర్తి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఎర్రబెల్లి దయాకర్‌రావు అనూహ్యం కాంగ్రెస్‌ అభ్యర్థి య‌శ‌స్విని రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఆయన సోదరుడు ప్రదీప్‌రావు కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓడిపోయారు. అయితే, ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఎల్లారెడ్డి నుంచి బరిలోకి దిగిన దయాకర్‌రావు అల్లుడు మధన్‌ మోహన్‌రావు మాత్రం విజయం సాధించారు.

తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల మొత్తం లిస్టు ఇదిగో, హైదరాబాద్‌లో మెజార్టీ సీట్లు ఏ పార్టీ కైవసం చేసుకున్నదంటే..

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన యూట్యూబర్‌ కర్నె శిరీష (బర్రెలక్క) నాలుగో స్థానంలో నిలిచారు. ఆమెకు మొత్తం 5,754 ఓట్లు పోలయ్యాయి. నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో తన గళం వినిపిస్తానంటూ ఆమె ఎన్నికల బరిలో నిలిచారు. కానీ జనం ఆమెను ఆదరించలేదు. కాగా, కొల్లాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. ఆయనకు మొత్తం 93,609 ఓట్లు పోలయ్యాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డికి 63,678 ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, బీజేపీ అభ్యర్థి అల్లేని సుధాకర్‌రావు 20,389 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.