Hyd, Mar 22: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం(మార్చ్ 22) ఒక ప్రకటన విడుదల చేసింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి. వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నారు. లోక్ సభ ఎన్నికలు, 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల, తెలంగాణ నుంచి ఐదుగురు అభ్యర్థుల ప్రకటన
తాజాగా రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో రానున్న లోక్‌సభ ఎన్నికలకుగాను బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికి 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లకు గులాబీ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితా
చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాబాద్
వరంగల్ (ఎస్సీ )-డాక్టర్ కడియం కావ్య
మల్కాజ్ గిరి - రాగిడి లక్ష్మారెడ్డి
ఆదిలాబాద్ - ఆత్రం సక్కు
జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్
నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్
కరీంనగర్ - బోయినపల్లి వినోద్ కుమార్
పెద్దపల్లి(ఎస్సీ) - కొప్పుల ఈశ్వర్
మహబూబ్ నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం -నామా నాగేశ్వరరావు
మహబూబాబాద్(ఎస్టీ)- మాలోత్ కవిత
మెదక్ - వెంకట్రామిరెడ్డి
నాగర్ కర్నూలు - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్