Hyd, April 26: తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశంలో రెండు పార్టీలు సవాళ్లు విసురుకుంటున్నాయి. తాజాగా గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు రాజీనామా లేఖతో గన్‌పార్క్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. హరీష్‌రావు సవాల్‌తో పోలీసులు భారీగా మోహరించారు. గన్‌పార్క్ వద్ద అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించిన హరీష్ రావు.. మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. ఆయనకు రావడానికి మొహమాటంగా ఉంటే పీఏతోనైనా స్టాఫ్‌తోనైనా రాజీనామా లేఖను పంపించాలన్నారు. జర్నలిస్టుల సాక్షిగా.. మేధావుల చేతిలో రాజీనామా లేఖను పెడుతున్నానన్నారు.దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసంచేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిజమైతే గన్‌పార్క్ వద్దకు ముఖ్యమంత్రి రావాలని డిమాండ్ చేశారు.ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే నా రాజీనామా ఆమోదించాలని లేఖ రాసి స్పీకర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు.
Here's Videos
రాజీనామా పత్రంతో అమరవీరుల స్థూపం వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
ఆగస్టు 15వ తేదీ లోపు రైతు రుణమాఫీ, ఆరు హామీల అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన హామీ నేపథ్యంలో ప్రతి సవాల్ విసిరిన హరీష్ రావు https://t.co/9uwdKe8g7H
— BRS Party (@BRSparty) April 26, 2024
రాజీనామా పత్రంతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు బయల్దేరే ముందు మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
ఆగస్టు 15వ తేదీ లోపు రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీల హామీల అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన హామీ నేపథ్యంలో ప్రతి సవాల్ విసిరిన హరీష్ రావు pic.twitter.com/z5rMYzjdAa
— BRS Party (@BRSparty) April 26, 2024
ఆగస్టు 15th లోగా ఏకకాలంలో రుణమాఫీ చేయాలి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ఇప్పటికే మోసం చేసింది. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పింది. సోనియమ్మ మాట అంటూ రేవంత్ రెడ్డి ప్రజలను ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారు. రైతుల కోసం నా రాజీనామా నా ఒక్క ఎమ్మెల్యే పదవి గొప్ప కాదు. రైతుల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. సోనియా గాంధీ పేరుతో తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారు’’ అని రేవంత్ ధ్వజమెత్తారు. . తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, ఆగస్ట్ 15 లోపల రూ. 2 లక్షల రుణమాఫీ, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టేసి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
గన్ పార్కు వద్దకు చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హరీశ్‌రావుకు మద్దతు పలికారు. ఈ సందర్బంగా తలసాని మాట్లాడుతూ, రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిందంటూ మండిపడ్డారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ మాట తప్పింది. ఇప్పుడు ఆగస్టు 15 అంటూ మరోసారి ఎన్నికల స్టంట్ వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే హరీష్ రావు సవాల్‌ను స్వీకరించి ఇక్కడికి రావాలి. ఇవాళ కాకున్నా రేపైనా హరీష్ రావు సవాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించాలని తలసాని డిమాండ్ చేశారు.