Yadadri, Jan 11: యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదని, పెళ్లికి కూడా ఒప్పుకోరని (Fearing their families disapproval to their marriage) భావించిన ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండలం బూర్గుపల్లికి చెందిన కోటోజు కృష్ణమూర్తి, మాధవి దంపతుల కుమారుడు సాయితేజ(20), అదే గ్రామానికి చెందిన మాడిశెట్టి నర్సింహులు, అనిత కుమార్తె అఖిల(17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
అఖిల ఇంటర్మీడియట్ ఇటీవల పూర్తి చేయగా సాయితేజ ఇంటర్ మధ్యలోనే వదిలేసి గ్రామంలోని పాల సెంటర్‌లో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే వీరద్దరి ప్రేమ వ్యవహారం నెలరోజుల క్రితం పెద్దలకు తెలిసింది. అప్పటి నుంచి నర్సింహులు తన కూతురు అఖిలను సమీప గ్రామం నెమిలలోని బంధువుల వద్ద ఉంచాడు. కాగా, ఆదివారంరాత్రి పాలసెంటర్‌లో విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన సాయితేజ రాత్రి 9 గంటల సమయంలో ఫోన్‌కాల్ రావడంతో బయటికి వెళ్లాడు.
మరోవైపు ఆదివారం రాత్రి నుంచే అఖిల కూడా కనిపించడంలేదని తెలిసిన తండ్రి నర్సింహులు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం సాయంత్రం సాయితేజ తాత శ్రీహరి మేకలు తోలుకుని తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా, అప్పటికే ఇద్దరు ప్రేమికులు చెట్టుకు చున్నీతో ఉరేసుకుని ( Lovers commit suicide at Burugupally) విగతజీవులుగా కనిపించారు. ప్రేమజంట అఘాయిత్యంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇక కూతురు ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్మకు పాల్పడిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం కాలనీ రాజీవ్‌గృహకల్పకు చెందిన మిరాజ్(40)కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కాగా ఇతడి పెద్ద కుమార్తె జవేరియా తల్లిదండ్రులు చూసిన సంబంధం కాదని వేరే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో తాగుడుకు బానిసైన మిరాజ్ మనస్తాపానికి గురవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ రాత్రి మిరాజ్ ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు జావేద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.