Fire (Representational image) Photo Credits: Flickr)

Hyderabad, April 7: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం (Afzal Gunj Fire Accident) చోటు చేసుకుంది. అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. భారీగా నిలువ ఉన్న టైర్ల గోదాంలో ఈ అగ్ని ప్రమాదం (Fire breaks out at tyre godown in Afzal Gunj) జరిగింది. గోదాం పక్కన ఉన్న గుడిసెవాసులు కపర్ వైరును కాల్చుతుండగా ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగాయి. అఫ్జల్‌గంజ్ పోలీస్ సిబ్బంది, స్థానికులు అక్కడ ఉన్న టైర్లను మరో చోటుకి తరలిస్తున్నారు.

ఇప్పటికే 15 ఫైర్ఇంజన్లు అక్కడ మంటలను ఆర్పుతున్నాయి. అఫ్జల్‌గంజ్ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలతో నిండిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గోదాం పక్కనే భారత్ పెట్రోల్‌ బంక్‌ ఉంది. ఇప్పటికైతే పెట్రోల్‌ బంక్‌కు ప్రమాదం జరగలేదు. కానీ, మంటలో అదుపులోకి రాకపోతే పెట్రోల్‌ బంక్‌కు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's Fire Video

ఈ ప్రమాదంలో భారీగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం. మరొక కథనం ప్రకారం టైర్లను కటింగ్ చేస్తున్న సమయంలో నిప్పంటుకుని మంటలు ఎగిసిపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అఫ్జల్ గంజ్, చాదర్ ఘాట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.