Representational Image | (Photo Credits: PTI)

Hyd, June23: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (HMD) తెలిపింది. శుక్రవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని (Rain Forecast)పేర్కొంది. రాష్ట్రంలోకి నైరుతి, పశ్చిమ దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తాయన్న వాతావరణశాఖ.. రాగల 48 గంటల్లో అకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో హైదరాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ మినహా అన్ని జిల్లాల్లో పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు (Rain Forecast in Hyderabad) కురిసినట్లు వివరించింది.

ఇక ఏపీలోని ప‌లు జిల్లాల్లో రేపు (శుక్ర‌వారం) ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (IMD) వెల్ల‌డించింది. రాష్ట్రంలోని ఉత్త‌రాంధ్ర‌లోని ప‌లు జిల్లాల‌తో పాటు రాయ‌ల‌సీమ‌లోని ఓ జిల్లాలో కూడా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. ఈ మేర‌కు విప‌త్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ అంబేద్క‌ర్ గురువారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

హైదరాబాద్‌లో కరోనా డేంజర్ బెల్స్, ఒక్కసారిగా పెరిగిన కేసులు, తాజాగా 315 కోవిడ్ కేసులు నమోదు, గత 24 గంటల్లో తెలంగాణలో 494 మందికి కరోనా

ఉత్త‌రాంధ్ర‌లోని అల్లూరి సీతారామరాజు , కాకినాడ , కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల‌తో పాటు కోస్తాంధ్ర‌లోని పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డా ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని అంబేద్క‌ర్ తెలిపారు. అదే స‌మ‌యంలో రాయ‌లసీమ‌లోని శ్రీ బాలాజీ తిరుప‌తి జిల్లాలోనూ ఓ మోస్త‌రు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. ఈ కార‌ణంగా ఈ జిల్లాల‌కు చెందిన ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న సూచించారు.