Wanaparthy Family Suspicious Deaths: వనపర్తిలో ఫ్యామిలీ అనుమానాస్పద మృతి, ఇంటి ఆవరణలో కుద్ర పూజకు సంబంధించిన వస్తువులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad, Aug 14: ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పదంగా మృతి (Wanaparthy Family Suspicious Deaths)చెందిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. తెలంగాణ ( Telangana ) లోని వనపర్తి జిల్లాలో రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో వేర్వేరు చోట్ల పడి ఉన్న మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి ఆవరణలో కుంకుమ,పసుపు, అగరబత్తీలు, నిమ్మకాయలు పడి ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దీనికి కారణం క్షుద్ర పూజలా లేక.. ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి చెందిన అజీరాం బీ(63), ఆమె కూతురు ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా (10) మృతదేహాలు ఇంట్లో వేర్వేరు చోట పడి ఉన్నాయి. అయితే.. అక్కడక్కడ పడి ఉన్న మృతదేహాలను చూసి షాక్‌నకు గురైన ఇరుగుపొరుగువారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు (TS Police) ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కత్తి మహేష్‌కి 14 రోజుల రిమాండ్, శ్రీరాముడుపై అనుచిత పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ చేసిన సైబైర్ క్రైమ్ పోలీసులు

అయితే సంఘటన స్థలంలో పలుచోట్ల గుంతలు తవ్వి ఉండటం.. ఇంటి ఆవరణంలో కుంకుమ, పసుపు, అగరబత్తీలు, నిమ్మకాయలు ఉండటం అందరిని భయాందోళనకు గురిచేస్తోంది. అయితే స్థానికులు ఆ ఇంట్లో క్షద్రపూజలు జరిగి ఉంటాయన్న అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాఉంటే.. కుటుంబసభ్యులందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా.. లేకపోతే ఎవరైనా హ్యతచేశారా.. క్షుద్రపూజల్లో భాగంగా ఎవరైనా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది.

వీరు ఆత్మహత్య చేసుకున్నారా.. లేదంటే ఎవరైనా ప్లాన్ ప్రకారం హత్య చేశారా.. అనేది తెలియాల్సి ఉంది. ఇంట్లో ఉన్న వారంతా చనిపోవడంతో ఈ మరణాల మిస్టరీ పోలీసులు సవాల్‌గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.