Telangana: సింగరేణిలో ఘోర ప్రమాదం, బొగ్గు గని పైకప్పు కూలడంతో నలుగురు మృతి, సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్
Telangana's Singareni ( photo-facebook)

Hyd, Mar 7: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగరేణి ఆర్‌జీ-3 పరిధిలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గని పై కప్పు కూలడంతో రాళ్ళ కింద ఆరుగురు కార్మికులు చిక్కుకుపోయారు. వీరిలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో అసిస్టెంట్‌ మేనేజర్‌తోపాటు ముగ్గురు కార్మికులు ఉన్నారు. మీస వీరయ్య అనే వ్యక్తికి తీవ్రమైన గాయాలవ్వగా గోదావరిఖని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. మరొకరి పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది.

సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. సహాయక చర్యలు చేపట్టింది. అసిస్టెంట్ మేనేజర్ తేజతో సహా మరో ముగ్గురు కార్మికులు జాది వెంకటేశ్వర్లు(ఆపరేటర్) రవీందర్ (బదిలీ వర్కర్) పిల్లి నరేష్ (ఎంఎస్‌) మీస వీరయ్య (సపోర్ట్ మెన్) మృతి చెందారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రాష్ట్ర అప్పులు రూ. 3.30 లక్షల కోట్లు, పన్ను ఆదాయం రూ. 1,08,212 కోట్లు, రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీష్ రావు

ఇక నిజామాబాద్ జిల్లాలోని ఆర్ముర్ మండలం చెపూర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. అతివేగంతో దూసుకువచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా... మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

కారు నిర్మల్ నుండి ఆర్మూర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులు రాము(22), జ్ఞానేశ్వర్ గౌడ్(30)లుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.