కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి లో శనివారం చోటుచేసుకున్న ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులపై తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై వేటు వేసింది. ఐసీయూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వసంత్‌ కుమార్‌, కావ్య తో పాటు నర్సింగ్‌ ఆఫీసర్‌ మంజులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విచారణ ఆదేశించారు. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని ఎలుకలు కొరికిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఓ రోగి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) లో రక్తపోటు సంబంధిత సమస్యలతో వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. అయితే అతని చేతులు, కాళ్లపై ఎలుకలు తీవ్రంగా కొరికి గాయపరచాయి. ఎలుకలు కుట్టడంతో చేతులు, కాళ్ల నుంచి రక్తం కారుతున్నట్లు బంధువులు గుర్తించారు. వారు వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వైద్య సిబ్బందిని అప్రమత్తమై షేక్‌ ముజీబ్‌ చికిత్స అందించారు.

Here's IANS Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)