
Chennai, Feb 13: ‘‘నా శరీర రంగు గురించి కొందరు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. నా రంగు నలుపు అని, నుదురు బట్టతలలా ఉంటుందని అంటున్న ప్రత్యర్థులను అగ్గిలా మారి వణికిస్తా’’ అని తెలంగాణ గవర్నర్ (Telangana Governor) తమిళిసై (Tamilisai Soundararajan) హెచ్చరించారు.
చెన్నై (Chennai) తండయార్‌పేటలోని బాలికల ప్రైవేటు పాఠశాలలో శనివారం జరిగిన వార్షికోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థినులకు బహుమతులు పంపిణీ చేసి మాట్లాడారు. తనను విమర్శించేవారికి గుణపాఠం చెప్పేలా.. వాళ్ళు ఓర్వలేనంతగా ఉన్నత స్థాయికి చేరతానని తెలిపారు. తనపై విమర్శలు పట్టించుకోనన్నారు.